- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర పాలిత ప్రాంతం లడక్ రాజధాని లేహ్‌లో హైటెన్షన్ నెలకొంది. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ యువత ఆందోళనకు దిగింది. లేహ్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. శాంతియుతంగా మొదలైన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. నిరసనకారులు CRPF వాహనానికి నిప్పు పెట్టారు.
- Advertisement -