ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెల్లడి
చెన్నయ్ : కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలోని నగదును పొందే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డెత్‌క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం వారసులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.15 లక్షల వరకు నగదు సెటిల్‌మెంట్‌కు ఎటువంటి మూడో వ్యక్తి ష్యూరిటీ అవసరం లేదని, దరఖాస్తు చేసిన 15 రోజుల వ్యవధిలోనే క్లెయిమ్‌ను పూర్తి చేస్తామని ఐఓబీ వెల్లడించింది. ఖాతాదారుడి డెత్ సర్టిఫికెట్, నామినీ గుర్తింపు పత్రాలను ఐఓబీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2026 మార్చి 31లోపు అన్ని బ్యాంకులు 15 రోజుల గడువులోగా సెటిల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో.. ఐఓబీ ఈ ఆన్‌లైన్ సౌలభ్యాన్ని వేగంగా అమల్లోకి తెచ్చింది.
15 రోజుల్లోనే డెత్‌క్లెయిమ్ చెల్లింపు
- Advertisement -
- Advertisement -



