Sunday, May 4, 2025
Homeక్రైమ్ఉపాధి కూలీ మృతి

ఉపాధి కూలీ మృతి

- Advertisement -

– కామారెడ్డి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-నిజాంసాగర్‌(మహమ్మద్‌నగర్‌)

ఉపాధి కూలీ మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్‌ మండలంలోని దూప్‌సింగ్‌ తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దూప్‌సింగ్‌ తండాకు చెందిన నర్ల నాయక్‌ (55) రోజు వారీగా శుక్రవారం సైతం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పనివద్దనే వాంతులవడంతో ఉపాధి సిబ్బంది గమనించి ఇంటికి పంపించారు. వెంటనే కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందారు. ఈ విషయంపై వైద్యాధికారులకు సంప్రదించగా మృతిచెందిన వ్యక్తి రిపోర్టులను పరిశీలించి ధృవీకరిస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -