Wednesday, March 25, 2026
E-PAPER
Homeక్రైమ్పదో తరగతి విద్యార్థిని మృతి

పదో తరగతి విద్యార్థిని మృతి

- Advertisement -

– ఖమ్మం జిల్లా కుర్నవల్లి గ్రామంలో విషాదఛాయలు
నవతెలంగాణ-తల్లాడ

పదో తరగతి విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం, యశస్విని అనే బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీలోని నెమలి బ్రహ్మోత్సవాలకు వెళ్లింది. రాత్రి సుమారు 11.45 గంటలకు స్వగ్రామం కుర్నవల్లి బొడ్రాయి సెంటర్‌కు ఆటోలో చేరుకున్నారు. ఆటో దిగి ఇంటికి వెళ్లే సమయంలో అకస్మాత్తుగా యశస్విని కింద పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే కల్లూరులోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పది అడుగులు వేస్తే ఇంట్లోకి వెళ్లేవారు, అంతలోనే మృతిచెందింది. నెమలిలో జెయింట్‌ వీల్‌ ఎక్కిందని, భయపడి, హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందేమోనని కుటుంబ సభ్యులు వాపోయారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని. వీఎం బంజర ప్రభుత్వ ఆస్పత్రికికి తరలించారు. తల్లాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యశస్విని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. యశస్విని తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -