- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మే 4వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రభుత్వ ఆస్పత్రి మెయిన్ గేట్ బయట వైపు ఒక గుర్తు తెలియని వ్యక్తి(60-65)సం. ఎరుపు రంగు టీ షర్టు, బ్లూ కలర్ ప్యాంటు ధరించినాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చుట్టుపక్కల వారు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స కోసం తరలించినారు. ఆ వ్యక్తిని పరిశీలించిన డాకర్లు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇతనికి సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 871265971 నంబర్కు సంప్రదించాలన్నారు.
- Advertisement -