Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి మంగళవారం తెలిపారు. రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 12వ తేదీ ఉదయం 11:25 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి నందు మెయిన్ గేట్ ప్రక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి వయస్సు అందజ 30 నుంచి 35 సంవత్సరాలు, తెలుపు కలర్ బనియన్ ఆకుపచ్చ రంగు ప్యాంట్ ధరించినాడు. అపస్మారక స్థితిలో కింద పడిపోయి ఉన్నందున వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ లో చికిత్స గురించి తరలించినారు. వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు వచ్చి పరిశీలించి అడ్మిట్ చేసుకుని చికిత్స అనంతరం తేదీ 13-05-2025 నాడు మధ్యాహ్నం 0200 గంటలకు మృతి చెందినట్లుగా నిర్ధారించారు.  వ్యక్తి వాలకం బట్టి లేబర్ పని చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది. ఇతని యొక్క జేబులు చెక్ చేయగా అతని జేబులో SBI KIOSK BANKING ID CARD లభించింది. ఐడి కార్డు పై ఉష కొయ్యల లింబాద్రి నివాసం కోట గల్లి నిజామాబాద్ అని తెలిసింది. గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ లో సంప్రదించగలరు. ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ నెంబర్ 8712659714 నంబర్కు సంప్రదించాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad