Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి గురువారం తెలిపారు. ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రైల్వే స్టేషన్ నిజామాబాద్ బయట మెయిన్ గేట్ ప్రక్కన రోడు దగ్గర మురికి నాలా లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కన ఉన్న ప్రయాణికులు గమనించి అతన్ని బయటకు తీసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా పోలీస్ సిబ్బంది 108 ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ నిజామాబాద్ కు చికిత్స గురించి తరలించగా వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు వచ్చి పరిశీలించి చూడగ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అతని వయసు సుమారు 55 నుండి 60 ఉంటుంది. అతని పైన బట్టలు తెలుపు రంగు, బ్లూ కలర్ ఫుల్ షర్ట్ గోధుమ రంగు ప్యాంట్ ధరించాడు. వ్యక్తి వాలకం బట్టి బిజినెస్ చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది. ఇతని జేబులు చెక్ చేయగా అతని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకలేదు.గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8712659714 ఫోన్ చేయాలని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad