నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మే 3వ తేదీన ఉదయం 05.30 గంటలకు గాంధీ చౌక్ లోని కచ్చిగా మజీద్ గేట్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ వయస్సు అందజ వయసు 60- 65 , ఎరుపు రంగు జాకెట్టు, గోధుమ రంగు చీర ధరించింది. అపస్మారక స్థితిలో ఉన్నందున అంబులెన్స్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స గురించి తరలించినారు. ఆమెను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందిదని నిర్ధారించారు. ఈమె వాలకం బట్టి భిక్షాటన చేసుకునే మహిళగా కనపడుతున్నది. ఈమెకు సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 8712659714 నంబర్కు సంప్రదించాలన్నారు.
గుర్తుతెలియని మహిళ మృతి
- Advertisement -
- Advertisement -

 
                                    