నవతెలంగాణ – హైదరాబాద్: ఈ తొక్కిసలాటలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 8 మంది మహిళలు, ఒక బాలుడున్నారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తుల తాకిడికి రెయిలింగ్ ఊడిపోయి పలువురు కిందపడటంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దురదృష్ట ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తుల మరణం అత్యంత విషాదకరం : చంద్రబాబు
- Advertisement -
- Advertisement -



