Sunday, October 5, 2025
E-PAPER
Homeకవితచావుల సంతకం

చావుల సంతకం

- Advertisement -

రెక్కలను జోడించి ఎండిన ఎముకలను
స్వేద జలంతో నేలను తడుపుతున్నడు
ఖాళీగా నిండుకున్న ఆకలి గాలి ఊపిరిలకు
మట్టిరేణువుల వాసనను పీలుస్తున్నడు
కన్నీటీ గాయాలను వైద్యం లేని గాలికి వదిలేశాడు
ఇంకా ఆశల చమురుతో
బుక్కెడు బువ్వకోసం
గిట్టుబాటు లేకున్నా గిరిగీసుకొని
సగం నిండని పేగులతో
రైతే రాజనీ, రైతే దేశానికి వెన్నెముకనీ
మాటల మాంత్రికుల
భజనలను వింటూ
సేద్యంచేసిన పంటకు ధరలేక
దళారీల రేటుకు దాసోహమంటూ
ఒక్కపూట పస్తులకు అలవాటై
రక్త కన్నీళ్లు రాల్చలేక
శ్రమతగ్గ ఫలితం లేక
సాగలేక ఈదలేక చెప్పలేక
పురుగు మందులతో స్నేహం చేసి
చావుల సంతకమై మిగిలిపోతున్నాడు
సమాధుల పై రైతన్నగా

  • డాక్టర్‌ పగిడిపల్లి సురేందర్‌, 8084846063
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -