Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు వ్యాచారచన, ఉపన్యాస పోటీలు

విద్యార్థులకు వ్యాచారచన, ఉపన్యాస పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో టీ శాట్ నెట్ వర్క్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మంగళవారం వ్యాచారచన, ఉపన్యాస, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజయదులుగా నిలిచిన విద్యార్థుల వివరాలను మండల నోడల్ అధికారి గంగాధర్ వెల్లడించారు. వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి శ్రీజ (కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), రెండవ బహుమతి ప్రణవి (చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), మూడో బహుమతి మనోజ్ఞ ( అమీర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) కన్సోలేషన్  బహుమతులు  రిత్విక (కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) గెలుపొందారు. ఉపన్యాస పోటీల్లో మొదటి బహుమతి వందన (బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), నవీన (ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ప్రణవి (చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), కన్సోలేషన్ బహుమతులు ఈశ్వరి (కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), హరీష్ (కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) విజేతలుగా నిలిచారు. క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మధుప్రియ, ప్రణవి, ప్రసన్న, నాగచైతన్య గెలుపొందగా ద్వితీయ స్థానం ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థులు మాధురి, సాగరిక, శాలిని, దిల్షాద్ సాధించారు.

ఓవరాల్ క్విజ్ విజేతగా కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీజ  నిలిచింది.విజేతల ఉద్దేశించి కమ్మర్ పల్లి మండల నోడల్ అధికారి  గంగాధర్ మాట్లాడుతూ  మండల స్థాయిలో ఎంపికైన విజేతలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలు హైదరాబాదులో జరుగుతాయని తెలిపారు. విజేతలను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య  అభినందించారు. కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు చౌడారపు రాంప్రసాద్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -