Saturday, March 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు అసెంబ్లీలో పద్దులపై చర్చ

నేడు అసెంబ్లీలో పద్దులపై చర్చ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీలో శనివారం పలు పద్దులపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 2023-24, 2024-25 వార్షిక నివేదికలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్‌ (థర్డ్‌ అమెండ్‌మెంట్‌ ) బిల్‌, 2026ను మంత్రి సీతక్క, తెలంగాణ ఎంప్లాయీస్‌ అకౌంటబులిటీ అండ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ పేరెంటల్‌ సపోర్ట్‌ బిల్‌, 2026ను మంత్రి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రవేశపెట్టనున్నారు. తర్వాత హోం, రవాణా, బీసీ సంక్షేమం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం తదితర శాఖల పద్దులపై చర్చిస్తారు. అంతిమంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2025-26 ఖర్చులకు సంబంధించిన సవరించిన అంచనాలను ప్రజెంట్‌ చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -