Friday, October 10, 2025
E-PAPER
Homeసినిమాప్రజల జీవన స్థితిగతులతో 'దక్కన్‌ సర్కార్‌'

ప్రజల జీవన స్థితిగతులతో ‘దక్కన్‌ సర్కార్‌’

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత కళా శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం ‘దక్కన్‌ సర్కార్‌’. ఈ చిత్ర పోస్టర్‌ను నటి, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మరో సీనియర్‌ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్‌ దేశ్‌ పాండే, హీరో చాణక్య, నటి మౌనిక పాల్గొన్నారు. విజయశాంతి మాట్లాడుతూ,’ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజాకళాకారుడు కళా శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళడం కోసం, ఈ చిత్ర విజయానికి నా వంతు కృషి చేస్తాను. తెలంగాణ ప్రాంతం నుండి ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది’ అని తెలిపారు. ‘తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే ఇలాంటి సినిమాల నిర్మాణం జరగాలి. ప్రభుత్వం తెలంగాణ సినిమాలను, కళాకారులను ప్రోత్సహించాలని కోరుతున్నాను.

ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన చిత్ర యూనిట్‌కు అభినందనలు’ అని మురళీధర్‌ దేశ్‌ పాండే చెప్పారు. దర్శకుడు, నిర్మాత కళా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘ఇది ప్రజల జీవన స్థితిగతుల కథ. సహజ సంఘటనలను బేస్‌ చేసుకొని సహజ సిద్ధంగా నిర్మించాను. 2 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఒడుదొడుకులు తట్టుకొని పూర్తి చేశాం. ఈ సినిమాకి నా అభిమాన తార విజయశాంతి ప్రమోషన్‌ చేయటం ఎంతో గొప్పగా అనిపించింది’ అని అన్నారు. హీరో చాణక్య మాట్లాడుతూ,’ఈ సినిమా కోసం నేను యాస, భాష, గ్రామీణ పరిస్థితులు, హావభావాలు ఇలా చాలా నేర్చుకున్నాను. ఈ చిత్ర విజయం మాకు అవసరం. దానికి ప్రజల ఆశీర్వాదం కావాలి’ అని చెప్పారు. మరో నటి మౌనిక మాట్లాడుతూ,’ఈ సినిమాలో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. ఈ వేడుకలో వివిధ జిల్లాల నుండి వచ్చిన సుమారు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -