వాషింగ్టన్ : తైవాన్‌కు ఆయుధాలను పంపాలా వద్దా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు. ‘ఈ విషయంపై జిన్‌పింగ్‌తో మాట్లాడుతున్నాను. మా మధ్య మంచి సంభాషణ జరిగింది. త్వరలోనే నిర్ణయం తీసు కుంటా’ అని ఆయన తెలిపారు. చైనా నేతతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఈ నెల 4వ తేదీన ట్రంప్‌తో జిన్‌పింగ్ టెలిఫోన్ సంభాషణ జరిపారు.
అమెరికాతో సంబంధాల విషయంలో పరస్పర గౌరవాన్ని కలిగి ఉండాలని ఈ సందర్భంగా జిన్‌పింగ్ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న తైవాన్ దీవికి ఆయుధాలు విక్రయించవద్దని హెచ్చరించారు. ద్వైపాక్షిక సంబంధాలలో తైవాన్‌కు అధిక ప్రాధాన్యత ఉన్నదని, తైవాన్‌కు ఆయుధాలు విక్రయించేటప్పుడు అమెరికా జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. కాగా జిన్‌పింగ్, ట్రంప్ ఏప్రిల్‌లో సమావేశమయ్యే అవకాశం ఉంది. తైవాన్‌ను అమెరికా అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ దానికి సైనిక పరంగా మద్దతు ఇస్తోంది. తైవాన్‌కు 11 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గత డిసెంబరులో ఆమోదం తెలిపింది.
తైవాన్‌కు ఆయుధ సరఫరాపై త్వరలోనే నిర్ణయం : ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


