– 2025లో రికార్డ్ పతనం..!
– బలపడుతోన్న యూరో, స్విస్ కరెన్సీలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలు, సుంకాలు, ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి తదితర అంశాలు డాలర్‌ను బలహీనపర్చుతున్నాయి. ట్రంప్ దెబ్బకు ఈ ఏడాదిలో డాలర్ సురక్షిత ఆస్తి స్థితిని దెబ్బతీసిందని.. ఇది రికార్డు స్థాయిలో క్షీణతకు దారి తీస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. అయినప్పటికీ డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతుంది. మరోవైపు యూరో, స్విస్ ఫ్రాంక్ వంటి ఇతర కరెన్సీలు బలపడుతున్నాయి. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 తొలి ఆరు మాసాల్లో డాలర్ విలువ 10.8 శాతం క్షీణించింది. ఇది 1973 తర్వాత అత్యంత కనిష్ట స్థాయి కావడం విశేషం. 2025 ఏప్రిల్ 2న ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి దిగుమతులపై కఠినమైన సుంకాలను ప్రకటించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ సుంకాలు ఆ దేశంలోని వినియోగదారులకు అధిక ఖర్చుల రూపంలో భారంగా మారాయి. ఈ పరిణామాలు యూఎస్ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ అస్థిర ఆర్థిక విధానాలతో రాబోయే దశాబ్దంలో యూఎస్ అప్పులను ట్రిలియన్ల డాలర్ల మేరకు పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాషింగ్టన్ రుణ స్థిరత్వంపై ఆందోళనలను పెంచింది. యుఎస్ ట్రెజరీ మార్కెట్ పట్ల పెట్టుబడిదారుల విముఖతకు దారి తీసింది. ఫె˜డరల్ రిజర్వ్ స్వాతంత్య్రంపై ట్రంప్ దాడులు డాలర్ సురక్షిత ఆస్తి స్థితిని బలహీనపరిచాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో డాలర్‌తో పోల్చితే యూరో విలువ 13 శాతం పెరిగింది.
తగ్గుతున్న డాలర్ ఆధిపత్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES