అడివి శేష్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘డెకాయిట్’. కొత్త దర్శకుడు షానీల్ డియో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ట్రైలర్ రేజ్ ప్రెస్మీట్లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ,’ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని మంచి సినిమాలు చేశామనేదే నా లైఫ్ ఫిలాసఫీ. ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ట్రైలర్లో వాటిని బయటపెట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడనే అంశమే ఈ కథలో ప్రధానంగా ఉంటుంది. ఫీలింగ్స్‌పై ఒక మంచి కథ చెప్పాలని ప్రయత్నించాం. ఈ సినిమా కథ లేయర్స్‌గా ఓపెన్ అవుతుంది. ఇది పూర్తిగా ఫీలింగ్స్ ఆధారంగా నడిచే సినిమా. డైరెక్టర్ షానీల్ గురించి చెప్పాలంటే, ఆయన చెప్పేటప్పుడు భోజ్‌పురి కల్చర్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అందుకే ఆ కల్చర్‌ని రిప్రజెంట్ చేయడానికి పవన్ సింగ్‌ని తీసుకొచ్చాం. మణాల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. సినిమా మొదటి అరగంట తర్వాత ఏం జరుగుతుందో గెస్ చేయడం చాలా కష్టం. ఇప్పటికే రెండు పాటలు హిట్ అయ్యాయి. పర్ఫెక్ట్ టైమ్‌లో సినిమా తీసుకువస్తున్నాం. ఇది యూనివర్సల్ కథ’ అని చెప్పారు.
‘ఈ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్లో నేను ఇంతవరకు కనిపించలేదు. సుప్రియతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆమె ఒక డైనమిక్ ప్రొడ్యూసర్. ప్రతి ఛాలెంజ్‌ని స్వీకరిస్తారు’ అని అనురాగ్ కశ్యప్ అన్నారు. డైరెక్టర్ షానీల్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఇదొక మంచి లవ్ స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్’ అని తెలిపారు. ‘ఈ కథకు అవసరమైన ప్రతిదాన్ని సమకూర్చాం. మొదటి నుంచే గ్రాండ్‌గా తీయాలనుకున్నాం. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది. మహేష్, ఎన్టీఆర్ ట్రైలర్‌ని షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్యూ’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు.
సునీల్ మాట్లాడుతూ, ‘శేష్ చాలా జెన్యూన్‌గా సినిమా చేస్తారు. ఈ కథ, నా పాత్ర చాలా బాగున్నాయి. అనురాగ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు.
‘పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్, శేష్ నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఇది పూర్తిగా టీమ్ వర్క్‌తో చేసిన సినిమా’ అని డీఓపీ ధనుష్ భాస్కర్ చెప్పారు. డీఓపీ రవి కే చంద్రన్ మాట్లాడుతూ, ‘సినిమా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో చూడటానికి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు.రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ,’అడివి శేష్ ప్రతి డీటైల్‌ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.ఈ సినిమా ఒక లైఫ్‌టైమ్ మూవీ అవుతుంది. ప్రతి ఐడియాని మరో స్థాయికి తీసుకెళ్లే ఆయన ప్రయత్నం అద్భుతం’ అని చెప్పారు.

ఛాలెంజింగ్‌గా సరస్వతి క్యారెక్టర్ చేశా
‘ఇందులో నేను చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా డిఫికల్ట్. ఒక యాక్టర్‌కు ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా కెరీర్లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇప్పటివరకు నేను చేయని కొత్త జోనర్ ఇది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. ఛేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజారు చేశాను. ‘సీతారామం, హారు నాన్న, ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయిలాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. ఈ సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ కథ విన్నప్పుడు సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌గా మారారో అనేది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది’.
– మృణాల్ ఠాకూర్



