హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకా యిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు.
అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన హీరో వెంకటేష్ మాట్లాడుతూ,’కొన్ని సినిమాలు మొదలైనప్పుడే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. సుప్రియ చాలా మంచి సినిమా తీస్తుందనే వైబ్ ఉండేది. ఎందుకంటే చాలా ప్యాషన్ ఉన్న టీంతో చేశారు. అందరూ మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందుకు రావాలి,పెద్ద హిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేశారు. శేష్‌ని ‘పంజా’లో చూశాను. అప్పుడే తను చాలా అద్భుతమైన నటుడు అవుతాడు అనిపించింది. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ హిట్స్ అయ్యాయి. మరిన్ని బ్లాక్‌బస్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో డౌట్ లేదు. ఇది మణాల్ బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమా ఎట్మాస్లో చూశాక చాలా నచ్చింది, ప్రాణం పెట్టి చేశాను. చాలా గ్రేట్‌ఫుల్‌గా అనిపించింది. ఈ సినిమా సుప్రియ సపోర్ట్ మీద నిలబడింది. ఈనెల 10న మీరందరూ ఒక హానెస్ట్ సినిమాను చూస్తారు. సినిమా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది’ అని హీరో అడివి శేష్ చెప్పారు.
‘డెకాయిట్’ బ్లాక్‌బస్టర్ ఖాయం
- Advertisement -
- Advertisement -



