హీరో అడివి శేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన తర్వాత మేకర్స్ గురువారం టీజర్‌ను విడుదల చేశారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ,’టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమా విషయంలో మేం చాలా ప్రౌడ్‌గా ఉన్నాము. ఇది చాలా బిగ్ ఫిలిం. రెండు భాషల్లో తీశాం. ఇది ప్రాపర్ తెలుగు, హిందీ సినిమా. షానియల్ అమెరికన్ స్టైల్‌లో తీశాడు.
అనురాగ్ లాంటి వరల్డ్ క్లాసు ఫిలిం మేకర్‌తో పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. మృణాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో వచ్చిందంటే కారణం ఆమే. నాగ్ ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ సాంగ్ ఆలోచన కూడా సుప్రియదే. ఆ క్లాసిక్ సాంగ్ తీసుకొని మన సినిమాలో వైబ్రేట్‌గా వాడడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సునీల్, జాన్వి కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు’ అని అన్నారు.
టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని చిత్రయూనిట్ తెలిపింది.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ‘డెకాయిట్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



