- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును గురువారం రోజు ఇరిగేషన్ డి ఈ ఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టులోకి బుధవారం రోజు 1,80, వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ప్రాజెక్టు లోకి రావడంతో సామర్థ్యానికి మించి పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో గురువారం రోజు ప్రాజెక్టులోకి 27 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి రావడం జరిగింది. ప్రాజెక్టు నుండి గురువారం 27,వేల క్యూసెక్కుల వరద నీరు పొంగిపొర్లింది. ప్రాజెక్టును ఎ ప్పటికప్పుడు డి ఈ ఈ వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -