సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 15
మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్‌లో రాతపరీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో 2026-28 బ్యాచ్ ప్రవేశాల కోసం డీసెట్-2026 రాతపరీక్ష మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో జరగనుంది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ జి రమేష్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 27న నోటిఫికేషన్‌ను విడుదల చేశామని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
వాటి సమర్పణకు తుది గడువు వచ్చేనెల 15వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు ఉందని వివరించారు. ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.450, ఇతరులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. డీసెట్ సమాచార బులెటిన్ ఈనెల ఐదో తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో డీసెట్ రాత పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్ 8317567404 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. రెండేండ్ల డీఈఎల్‌ఈడీ కోర్సు ప్రభుత్వ డైట్, ప్రయివేటు, మైనార్టీ, నాన్ మైనార్టీ కాలేజీల్లో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు https://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
నేటి నుంచి డీసెట్ దరఖాస్తుల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



