Monday, September 15, 2025
E-PAPER
Homeసినిమాభిన్న థ్రిల్లర్‌గా 'దీక్ష'

భిన్న థ్రిల్లర్‌గా ‘దీక్ష’

- Advertisement -

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’. ఈ సినిమాలో మంచు మోహన్‌ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారి ఈ చిత్రంలో నటించడం విశేషం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కష్ణ మల్లా అందించారు. ఈ నెల 19న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డైరెక్టర్‌ వంశీకష్ణ మల్లా మాట్లాడుతూ, ‘ఇదొక డిఫరెంట్‌ థ్రిల్లర్‌ మూవీ. ‘కన్నప్ప, మిరాయ్‌’లాగే మా సినిమాను రిలీజ్‌ చేస్తున్న మైౖత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాట్రిక్‌ దక్కాలి’ అని అన్నారు. ‘ఈ కథను నా దగ్గరకు నాన్న తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నాన్న ఇమేజ్‌కు తగినట్లు పర్పెక్ట్‌ క్యారెక్టర్‌ ఉంది. ఈ సినిమాకు మనోజ్‌ ఇచ్చిన సజెషన్స్‌ను తీసుకున్నాను. మా చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు’ అని మంచు లక్ష్మీ తెలిపారు. మంచు మనోజ్‌ మాట్లాడుతూ, ‘నా మిరాయ్‌ మూవీలాగే అక్క, నాన్న కలిసి నటించిన ఈ సినిమాను కూడా ప్రేక్షకులు పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -