నవతెలంగాణ – కంఠేశ్వర్
స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యఅతిథిగా పాల్గొని ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీన్ దయాలు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ మరియు నరేంద్ర మోడీ ఇలాంటి నాయకులు దేశాభివృద్ధికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ హైందవ రాష్ట్రానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మత మానవత వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర లాంటి పుస్తకాలు రాశారని, దీన్ దయాల్ ఉపాధ్యాయ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమం అందాలని ఆయన సూచించిన అంత్యోదయ సిద్ధాంతం. భగవంతుడు పిల్లల్లో కొంతమందిని అవయవ లోపంతో సృష్టిస్తాడని, దానికి కృంగిపోకుండా వారికి ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను ఉపయోగించుకొని వృద్ధిలొకి రావాలని ఆయన కోరారు. స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసే దివ్యాంగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు అన్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షుడు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ దివ్యాంగజన్ రియాబిలిటేషన్ స్కీం ను ప్రవేశపెట్టి స్వచ్ఛంద సేవ సంస్థలకు నిధులను అందిస్తుందని ఆయన తెలిపారు. దివంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి సాధారణ పిల్లలతో సమానంగా ఎదగడానికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీని ఆయన అభినందించారు. దివ్యాంగుల అభివృద్ధిని కాంక్షిస్తూ వారికోసం వివిధ కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తున్న స్నేహ సొసైటీని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అంద విద్యార్థులకు క్యాష్ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా దివ్యాంగ బాలలు సాంస్కృతిక కార్యక్రమాలు, యోగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానసిక దివ్యాంగులు, అంద విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.