Friday, September 19, 2025
E-PAPER
Homeసినిమా'కల్కి' సీక్వెల్‌ నుంచి దీపిక ఔట్‌

‘కల్కి’ సీక్వెల్‌ నుంచి దీపిక ఔట్‌

- Advertisement -

ప్రభాస్‌ ‘కల్కి’ సీక్వెల్‌ నుంచి దీపిక పదుకొనెని మేకర్స్‌ తప్పించారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ‘చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ‘కల్కి’ సీక్వెల్‌లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియ జేస్తున్నాం. తొలి భాగంలో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో భాగంలో పార్ట్‌ కావడం లేదు. ‘కల్కి’ లాంటి సినిమా చేయాలంటే చాలా అంకితభావం అవసరం. దీపికకి ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ అఫీషియల్‌ స్టేట్‌మెంట్‌ని రిలీజ్‌ చేశారు. ‘కల్కి’ దీపికకి తొలి తెలుగు సినిమా. చాలా అంచనాలతో అడుగుపెట్టింది. ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. రెండో భాగంలో చాలా కీలకం. అయినప్పటికీ నిర్మాతలు తొలగించే పరిస్థితి వచ్చిందంటే మామూలు విషయం కాదు. నిర్మాతలు ఈ నిర్ణయానికి రావడానికి కారణం దీపికనే అనే సమాధానం వస్తుంది.

‘కల్కి’ చిత్రానికి తీసుకున్న పారితోషికం కంటే సీక్వెల్‌కి భారీ మొత్తంలో ఏకంగా రెట్టింపు పారితోషికాన్ని అడగటంతోపాటు షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ఆమె 25 మంది అసిస్టెంట్లకు బేటాలతోపాటు హోటల్‌ రూముల సౌకర్యాలు కల్పించాలని..ఇలా పలు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ‘స్పిరిట్‌’ కోసం సందీప్‌ రెడ్డి వంగా దీపికని సంప్రదించి, ఆమె పెట్టిన కండీషన్లు భరించలేక వెంటనే తప్పించేశాడు. ఇప్పుడు ‘కల్కి’ విషయంలో కూడా అదే జరిగింది. రెగ్యులర్‌ సినిమాల కంటే ‘కల్కి’ చాలా హార్డ్‌ వర్క్‌, టైమ్‌ అవసరం. వైజయంతీ సంస్థ ట్రీట్మెంట్‌, రెమ్యునరేషన్‌ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయదు. కానీ తలకు మించిన కండీషన్లు పెడితేనే చిక్కు. ఇప్పుడు దీపిక తన యాటిట్యూడ్‌ చూపించింది. తొలి పార్ట్‌లో భాగమయ్యాను, ఇప్పుడు లేనిపోని పేచీలు పెడితే ప్రాజెక్ట్‌కే ఇబ్బందనే వృత్తి ధర్మం గురించి కూడా దీపిక ఆలోచించకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -