నవతెలంగాణ – మణుగూరు:
మణుగూరు సుందరయ్య నగర్‌లో విజయ విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో కాంతులీనగా వెలిగిపోగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. చిన్నారులు, మహిళలు దీపాలను వెలిగించి స్వామివారికి ప్రార్థనలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.దీపోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించగా, భక్తుల ఉత్సాహం చూస్తూ తిలకించారు ఈ కార్యక్రమంలో సుధా వెంకటేశ్వర్లు అక్కినపల్లి సత్యనారాయణ మేదరమెట్ల యాదగిరి నక్క సురేష్ రాహుల్ నక్క వాసు సెంట్రింగ్ ప్రసాద్ రాయగిరి నగేష్ ఎడారి శ్రీను బంకు శివ మహేష్ అశోక్ సంతు చక్రీధర్ బొబ్బు రవి తాళ్లపల్లి యాదగిరి గౌడ్ కుంట లక్ష్మణ్ సత్యనారాయణ సాత్విక్ ధర్మ తేజ ల్యాబ్ వెంకట్ మధుసూదన్ రెడ్డి బంటి మరియు కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.
మణుగూరు సుందరయ్య నగర్‌లో దీపోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES