తొలి వన్డేలో భారత్ విజయం
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్) : ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్, 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో రాణించగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో భారత మహిళలు 4 వికెట్ల తేడాతో గెలుపొందారు. 259 పరుగుల ఛేదనలో ఓపెనర్లు ప్రతిక రావల్ (36, 51 బంతుల్లో 3 ఫోర్లు), స్మృతీ మంధాన (28, 24 బంతుల్లో 5 ఫోర్లు) సహా హర్లీన్ డియోల్ (27, 44 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17) నిష్క్రమణతో 124/4తో భారత్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో జెమీమా రొడ్రిగస్ (48, 54 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి దీప్తి శర్మ (62 నాటౌట్) అద్భుత భాగస్వామ్యం నిర్మించింది. రిచా ఘోష్ (10) నిరాశపరిచినా.. ఆమన్జోత్ కౌర్ (20 నాటౌట్, 14 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా దీప్తి శర్మ లాంఛనం ముగించింది. 48.2 ఓవర్లలో 6 వికెట్లకు భారత్ 262 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళలు 50 ఓవర్లలో 6 వికెట్లకు 258 పరుగులు చేశారు. సోఫి (83, 92 బంతుల్లో), అలైస్ (53, 73 బంతుల్లో 2 ఫోర్లు), నటాలీ (41, 52 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ (2/55), స్నేV్‌ా రానా (2/31) మెరిశారు. ఛేదనలో మెరిసిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. భారత్, ఇంగ్లాండ్ మహిళల రెండో వన్డే శనివారం లార్డ్స్‌లో జరుగనుంది.
దీప్తి మెరువగా..!
- Advertisement -
- Advertisement -