నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు గ్రామాలలో జింకలు వ్యవసాయ భూముల పంట పొలాల్లో గుంపులు గుంపులుగా మందగా వచ్చి పంట పొలాలను తొక్కెసి భారీగా పంట నష్టం జరిగిపోతున్నాయని రైతులు ఆందోళన చేందుచున్నారు. మండలంలోని గ్రామాలైన నాగల్ గావ్ , పడంపల్లి , పెద్ద ఏడ్గి , చిన్న ఏడ్గి , బస్వాపూర్ , దోస్పల్లి , బంగారు పల్లి , గుండూర్, పెద్దగుల్లా, చిన్నగుల్లా , కంఠాలి గ్రామాలలో జింకల బెడద రైతులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఖరీఫ్ లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు , ముందే వర్షాలు లేక రైతులు దిగాలుగా ఉంటే, కొద్దిపాటి వర్షంతో పంటలను సాగు చేస్తున్న రైతులు నిత్యం జింకలు గుంపులు గుంపులుగా వందలాదిగా మందలు మందగా వస్తు ఇప్పుడిప్పుడే మొలక దశలో ఉన్న పంట పొలాలను తొక్కేసి పంట నష్టం చేస్తున్నాయి.
మొక్క దశలో ఉన్న ఖరీఫ్ పంటలైన సోయా, పత్తి , కందులు , పెసర , మినుము , పంటలకు భారీగా పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తున్న తరుణంలో అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోలేక రాత్రి , పగలు అని తేడా లేకుండా నిద్రాహారాలు మానేసి వాటి కావలి చేయడానికి పొలాలకు వెళ్లాల్సిన దుస్థితి గ్రామాల రైతులకు నేలకొంది. జింకల నివారణ అటవీశాఖ అధికారులు చేయాల్సింది పోయి ఏమి పట్టనట్టు ఉంటున్నారు. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల రైతులు అంటున్నారు. జింకలను వేటాడడానికి కుక్కలు వెంబడించడం వలన కొన్ని జింకల చిన్న పిల్లలకు కుక్కల వెంబడించి దాడికి పాల్పడుతున్నాయి. చిన్న జింక పిల్లలు కుక్కల దాడిలో మృత్యువాత పడుతున్నారని పలు గ్రామాల రైతులు తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి జింకల నివారణకు ఉపాయం కనిపెట్టి , వాటిని నివారించాలని మండల రైతులు కోరుతున్నారు.