”శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. అందమైన లవ్‌స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. ఈ సమ్మర్‌లో ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ లవ్‌స్టోరీగా వస్తున్న ఈ సినిమా హర్షిత్ రెడ్డి కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల, ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్, డీవోపీ – వంశీ పచ్చిపులుసు, మ్యూజిక్ – ఈశ్వర్ చంద్, స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి.
అందమైన ప్రేమకథతో ‘దీవాన’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



