Monday, October 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌ను ఓడించండి

కాంగ్రెస్‌ను ఓడించండి

- Advertisement -

అప్పుడు హామీలు అమలు చేస్తారు : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో షేక్‌పేట్‌ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు చెర్క మహేశ్‌. తన అనుచరులతో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజలకు కారు కావాలా? బుల్డోజర్‌ కావాలా? నిర్ణయించుకోవాలన్నారు. రెండేండ్లలో ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ నగరం తిరిగి అభివృద్ధిలోకి రావాలంటే మళ్లీ కేసీఆర్‌ రావాలనీ, అది జూబ్లీహిల్స్‌ నుంచే మొదలు కావాలని ఆకాంక్షించారు. ఒక్క మంచి పని చేయని కాంగ్రెస్‌ సర్కార్‌ రూ.2.30 లక్షల కోట్లు అప్పు మాత్రం చేసిందని చెప్పారు. నగరంలో పేదలకు ఇండ్లు లేకుండా బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని విమర్శించారు. మెసం చేసే వారినే ప్రజలు నమ్ముతారని గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారనీ, తెలిసి ప్రజలను మోసం చేసిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -