- Advertisement -
నవతెలంగాణ – పరకాల
పంచాయతీ ఎన్నికల్లో పోటీపడి ఓటమి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని, ఓటమి గెలుపుకు తొలిమెట్టుగా భావించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం పరకాల మండలం పోచారం, వెల్లంపల్లి, పైడిపల్లి, కామారెడ్డిపల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఓడిన పార్టీ అభ్యర్థులను కలిసి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



