Friday, October 10, 2025
E-PAPER
Homeఖమ్మంఫాసిస్టు శక్తులను ఓడించండి

ఫాసిస్టు శక్తులను ఓడించండి

- Advertisement -

– సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా అభ్యర్థులను గెలిపించండి
– పార్టీ రాష్ట్ర నేత కెచ్చెల రంగారెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట

గెలిచిన తర్వాత ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని,ఊసరవెల్లి లాగా రంగులు మార్చే పాలక  పార్టీల అభ్యర్ధులను ఓడించి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా అభ్యర్థులను గెలిపించి, పాలక ఫాసిస్టు నాయకులకు బుద్ధి చెప్పాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చెల రంగారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై పార్టీ మండల స్థాయి సర్వసభ్య సమావేశం అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల లో పార్టీ మండల బాధ్యులు వాసం బుచ్చి రాజు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్, బిఆర్ ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ముందుకు వస్తున్నాయని గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పేరు తోటి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అన్నారు.ప్రజలకు ఇస్తానన్న అనేక వాగ్ధానాలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. అదే విధంగా రెండు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు, ప్రకటించిన 6 గ్యారంటీ లలో ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు.

గిరిజనులు,గిరిజనేతర పేదలు సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఇవ్వకపోగా అటవీ శాఖ అధికారులు పోడు సాగులో ఉన్న పంటలు కాత,పూత మీద ఉండి చేతికి వచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నా ఏ ఒక్క మంత్రి గాని,ఎమ్మెల్యేలు గాని మాట్లాడక పోవడం వీరికి ప్రజల పైన ఎలాంటి ప్రేమ ఉందో లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ లు అధికారంలోకి రావడం కోసం ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీ పడుతున్నారని అన్నారు. నిత్యం ప్రజల కోసం నిలబడి పని చేస్తూ ప్రజా సమస్యల కోసం ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీల అభ్యర్ధులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, జిల్లా నాయకుడు కంగాల కల్లయ్య,పార్టీ మండల నాయకులు బాడిస లక్ష్మణ్ రావు, కంగాల భూ లక్ష్మి, గొంది లక్ష్మణ్ రావు,సొసైటీ డైరెక్టర్ మడివి నాగేశ్వరావు, గాండ్లగూడెం ఎంపీటీసీ పరిధిలోని గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -