Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల ఓసీపీలో రక్షణ పక్షోత్సవాలు

తాడిచెర్ల ఓసీపీలో రక్షణ పక్షోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఏఎమ్మార్ కంపెనీ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా తాడిచర్ల ఓసిపిని శుక్రవారం సేఫ్టీ కమిటీ కన్వీనర్, సభ్యులు సందర్శించారు. మైన్ లోని అన్ని విభాగాలని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మైన్ లో కచ్చితమైన రక్షణ చర్యలు పాటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మైన్ లో తీసుకునే రక్షణ చర్యల పైనే మైన్ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకటరమణ, మైన్ ఏజెంట్  జీవకుమార్, సభ్యులు  జాకీర్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ప్రకాష్, జెన్కో జిఎం మోహన్రావు, వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్, ప్రభాకర్ రెడ్డి, కేఎస్ఎన్ మూర్తి, మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -