Wednesday, January 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఐక్యరాజ్యసమితిని రక్షించుకుంటాం: చైనా

ఐక్యరాజ్యసమితిని రక్షించుకుంటాం: చైనా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐక్యరాజ్యమితి, దానిలో అంతర్భాగంగా ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను రక్షించుకుంటామని చైనా ప్రకటించింది. ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’లో చేరాలంటూ ట్రంప్‌ ఆహ్వానించిన మరుసటి రోజు చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. విభేదాలను పరిష్కరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’లో చేరడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి ఆహ్వానం అందిందని చైనా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్పులతో సంబంధం లేకుండా చైనా ఐక్యరాజ్యసమితి ఆధారిత అంతర్జాతీయ ప్రపంచ క్రమానికి మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్‌ బుధవారం తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితి ఎలా మారినప్పటికీ, చైనా ఐక్యరాజ్యసమితి, దాని ప్రధాన కేంద్రంగా కలిగి ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను సమర్థిస్తుంది. అంతర్జాతీయ సంబంధాలు ఐక్యరాజ్యసమతి చార్టర్‌ లక్ష్యాలు మరియు నిబంధనల ఆధారంగానే ఉంటాయని గువో జియాకున్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -