నవతెలంగాణ – ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మంగళవారం రోజు ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల పోస్టర్లు, స్టిక్కర్లను, బ్యానర్ లను బిడిసి నాయకులు , అధ్యాపకులు, నాయకులు విడుదల చేశారు. ముధోల్ గత సంవత్సరం ప్రారంభం అయిన డిగ్రి కళాశాలలో ఈసంవత్సరం లో అడ్మిషన్లు మరింత పెంచేందుకు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులు ముధోల్ బి డి సి సహకారాన్ని కోరారు. ఇంటర్ పూర్తి అయిన విధ్యార్థులు డిగ్రీ కోరకు తమ అడ్మిషన్లు కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడానికి అవకాశం ఉందని కళాశాల అధ్యాపకులు తెలిపారు. మే3వ తేదీ నుంచి ప్రారంభమైన అడ్మిషన్లు జూన్ 19 వరకు అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మూడు విడతల్లో ఆసక్తిగల విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరవచ్చని వారు కోరారు. డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఈ అవకాశం చేసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ముధోల్ బిడిసి అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి దశరథ్, ఉపాధ్యక్షుడు నగేష్,కోశాధికారి జిదంవార్ వెంకటేష్, రిటైర్ ఉపాధ్యాయులు ధర్మపురి సుదర్శన్,సాయాన్న, నాయకులు కోరి పోతన్న,పతంకి కిషన్,అజీజ్,దిగంబర్, గ్రామ సభ్యులు, అధ్యాపకులు, యువకులు, తదితరులు, పాల్గొన్నారు.
ముధోల్ లో డిగ్రీ కళాశాల పోస్టర్లు విడుదల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES