Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంమూడేండ్లైనా డిగ్రీ కళాశాలకు ఆదరణ లేదు..

మూడేండ్లైనా డిగ్రీ కళాశాలకు ఆదరణ లేదు..

- Advertisement -

భవన సముదాయం లేదు, బోధకులు లేరు..
ఏజెన్సీలో ఉన్నత విద్య ప్రశ్నార్ధకం..
నవతెలంగాణ – అశ్వారావుపే

విద్యతోనే సమాజం సమగ్ర అభివృద్ది చెందుతుందని వేదికలు పై ప్రసంగాలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు ఆ విద్య క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతుందో మాత్రం పట్టించుకోరు. దీంతో కళాశాల ఉంటే భవనాలు లేక భవనాలు ఉంటే బోధకులు లేక బోధకులు ఉంటే విద్యార్ధులు లేక ప్రభుత్వ విద్య అడవి కాచిన వెన్నెల చందాన తయారైంది.

నియోజక వర్గం అయిన అశ్వారావుపేట లో డిగ్రీ కళాశాల కోసం నాటి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనేక సార్లు యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి కళాశాల ఏర్పాటుకు మార్గం వేసారు. అనంతరం అధికారంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్వయానా నాటి మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడి కళాశాలను మంజూరు చేయించారు.

ప్రస్తుత ఇంచార్జి ప్రిన్సిపాల్ పండ్లు గోపి తెలిపిన వివరాల ప్రకారం…2023 – 2024 విద్యాసంవత్సరం మే మెచ్చా నాగేశ్వరరావు కృషితో కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలను నాలుగు విభాగాలు అంటే బీఏ,బీకాం,బీఎస్సీ లైఫ్ సైన్సెస్,బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో ఒక్కో విభాగంలో 60 సీట్లు చొప్పున ముఖ్యాంశాలను మంజూరు చేసారు.

 మంజూరు అయినప్పటికీ అప్పటికే డిగ్రీ ప్రవేశాల “దోస్త్” ప్రక్రియ ముగియడంతో ఒక విద్యా సంవత్సరం కోల్పోయింది. 2024 – 2025 విద్యా సంవత్సరంలో పట్టుమని 11 మంది మాత్రమే చేరారు.ఏదో ఆ సంవత్సరం ఒకరిద్దరు గెస్ట్ లెక్చరర్ లతో విద్యా సంవత్సరం ముగిసింది.

ప్రస్తుతం ఈ ఏడాది 2025 – 2026 విద్యా సంవత్సరంలో బీఏ లో 11,బీకాం లో 4,బీజడ్సీ 1 చొప్పున మొత్తం 16 మంది  మాత్రమే అశ్వారావుపేట కళాశాలలో ప్రవేశం పొందారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన సముదాయంలో నే ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు. భవన సముదాయం ఏర్పాటు లో జాప్యం జరిగినా నా కానీ రెగ్యులర్ ప్రిన్సిపాల్ ను,బోధనా సిబ్బందిని తక్షణమే నియమించాలని,గెస్ట్ లెక్చరర్ లుగా స్థానికుల నే నియమించాలని విద్యావేత్తలు,పలువురు ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

చదువరి,ఉపాద్యాయ వృత్తి నుండే ప్రజా సేవకోసం రాజకీయాలలో ప్రవేశించి నేడు ఎమ్మెల్యే గా సేవలు అందిస్తున్న జారె ఆదినారాయణ ఈ కళాశాలను అభివృద్ది చేయాలని,ఈ ప్రాంతం ఆదివాసీ పిల్లలు విద్యాధికులు కావడానికి తన వంతు కృషి చేయాలని గిరిజన విద్యాధికులు,నాయకులు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img