- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ- సీ బీ సీ ఎస్- ఒకటవ,మూడవ,ఐదవ, సెమిస్టర్ (రెగ్యులర్) మరియు రెండవ, నాల్గవ, ఆరవ, సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాపితంగా 30 సెంటర్లలో గురువారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 5437 మంది విద్యార్థులు ఉండగా 5193 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6082 మంది విద్యార్థులు ఉండగా 5645 మంది విద్యార్థులు హాజరు కాగా , 437 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ గంటా చంద్రశేఖర్ తెలిపారు.
- Advertisement -



