Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టా దారులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి 

పట్టా దారులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి 

- Advertisement -

వ్యవసాయ విస్తరణ అధికారి ఎండి. రాజా
నవతెలంగాణ – పరకాల
: పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణాధికారి ఎండి రాజా తెలిపారు. శుక్రవారం పరకాల మండలంలోని పోచారం గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ( రైతు గుర్తింపు కార్డు ) నమోదు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమం ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుని ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్ లో నమోదు చేసి ప్రతి రైతుకు 14 అంకెల ఫార్మర్ ఐడిని కేటాయించడం జరుగుతుందన్నారు‌.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించబడుతాయన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని 14 అంకెల ఐడిని పొంది భద్రపరుచుకోవాలని ఈ సందర్భంగా ఏఈఓ రాజా తెలియజేశారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకొనుటకు రైతులు ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకి అనుసంధానించబడినటువంటి (లింక్ అయినా)మొబైల్ ను రైతు స్వయంగా తీసుకొని తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి మిట్టపెల్లి శ్రీనివాస్, పరకాల మార్కెట్ డైరెక్టర్ బుడిమె రాజయ్య, ఇప్ప రాజేష్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -