Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయండిగ్రీ గెస్ట్‌ లెక్చరర్ల ను రెన్యువల్‌ చేయాలి

డిగ్రీ గెస్ట్‌ లెక్చరర్ల ను రెన్యువల్‌ చేయాలి

- Advertisement -

– డిగ్రీ గెస్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ రాష్ట్ర
అధ్యక్షులు డా||కొర్ర ఈశ్వర్‌ లాల్‌
నవతెలంగాణ-అచ్చంపేట

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ గెస్ట్‌ లెక్చరర్ల సేవలు అమూల్యమైనవని, విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూనే అరకొర జీతాలతో అంకితభావంతో బోధిస్తున్న డిగ్రీ గెస్ట్‌ లెక్చరర్ల సేవలను కొనసాగించాలని డిగ్రీ గెస్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డా||కొర్ర ఈశ్వర్‌ లాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి ఆదేశానుసారం అకాడమిక్‌ క్యాలెండర్‌లో భాగంగా నెల 4వ తేదీ నుంచి రాష్ట్రంలోని 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ద్వితీయ, తృతీయ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయని, జులై 2 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ డిగ్రీ కళాశాలల్లో 30శాతం నుంచి 90శాతం వరకు బోధన గెస్ట్‌ లెక్చరర్లపై ఆధారపడి నడుస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనాన్స్‌ అప్రూవల్‌, గెస్ట్‌ లెక్చరర్ల నియామక నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో విద్యార్ధులకు పాఠశాలల ప్రారంభం అలస్యమవుతుందని తెలిపారు. కాబట్టి గత ఐదారు సంవత్సరాలుగా బోధన చేస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల సేవలను వెంటనే రెన్యువల్‌ చేయాలని, తద్వారా విద్యార్థులకు సమయానుకూలంగా సిలబస్‌ పూర్తి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన ఉన్నత విద్య అందేలా చూడాలని ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ఉన్నత విద్యా కమిషనర్‌ విద్యాశాఖ కార్యదర్శిని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad