Saturday, December 20, 2025
E-PAPER
Homeక్రైమ్డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

- Advertisement -

– చర్లపల్లి సోషల్‌వెల్ఫేర్‌ గురుకుల కళాశాలలో కలకలం
నవతెలంగాణ-నల్లగొండ టౌన్‌

గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్ర పరిధిలోని చర్లపల్లి సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల కళాశాలలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండలం గోగిగూడెం గ్రామానికి చెందిన విద్యార్థిని శివాని చర్లపల్లిలోని సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. మధ్యాహ్న సమయంలో కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. గమనించిన తోటి విద్యార్థినులు, అధ్యాపకులు వెంటనే పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. జీవితంపై విరక్తితో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శివాని సూసైడ్‌ లెటర్‌ రాసిందని రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు. విద్యార్థిని తల,మెడ ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -