Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండిగ్రీలు సరిపోవు.. నైపుణ్యాలు పెంచుకోండి

డిగ్రీలు సరిపోవు.. నైపుణ్యాలు పెంచుకోండి

- Advertisement -

– ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉద్యోగ అవకాశాల కోసం డిగ్రీలు సరిపోవనీ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి సూచించారు. శనివారం ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్వహించిన ఇండియా స్కిల్స్‌ కాంపిటేషన్‌ 2025-26 దక్షిణ ప్రాంతీయ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ డిజిటల్‌ అవగాహన, అనుకూలన శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం అవసరమని స్పష్టం చేశారు. ఈ పోటీలు క్రమశిక్షణ, నైపుణ్యం, సృజనాత్మకత, ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు, సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌, శిక్షకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -