Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయండిగ్రీలు ఉన్నా..ఉద్యోగాలు లేవు

డిగ్రీలు ఉన్నా..ఉద్యోగాలు లేవు

- Advertisement -

ఉన్నత విద్యలో తీవ్ర నైపుణ్య లోటు
యువతకు ఉపాధి కల్పించలేని మోడీ సర్కార్‌
తగిన సంఖ్యలో పరిశ్రమలూ కరువు
ఇదంతా ప్రభుత్వ విధాన వైఫల్యమే
ఫలితంగా తీవ్ర నిరాశలో యువత
దేశ భవిష్యత్తుకు పెను ప్రమాదం
మేధావులు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ :
భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభాను కలిగి ఉన్న దేశం. అదే స్థాయిలో ఉన్నత విద్య భారీ సంఖ్యలో పట్టభద్రులను ఉత్పత్తి చేస్తోంది. కానీ అదే యువత నేడు నిరుద్యోగం, నైపుణ్య లోటు, అనిశ్చిత భవిష్యత్తుతో తీవ్రంగా బాధపడుతోంది. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. దానిని విస్మరించింది. దీంతో దేశంలో తీవ్ర నిరుద్యోగం ఏర్పడింది. పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలూ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి. భారత్‌లో ప్రతి ఏడాదీ లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకొని బయటకు వస్తున్నా.. వారిలో చాలా మంది ఉద్యోగయోగ్యులుగా మాత్రం తయారు కావటం లేదు. దీనికితోడు దేశంలో అందుకు తగిన స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లేవు. తగిన సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీల స్థాపన కూడా జరగటం లేవు. అయితే ఇది కేవలం విద్యార్థుల వైఫల్యం కాదనీ, ఇది కచ్చితంగా ప్రభుత్వ విధాన వైఫల్యమని మేధావులు, నిపుణులు చెప్తున్నారు.

కాగితాలకే పరిమితమైన కేంద్ర పథకాలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తరచుగా ‘స్కిల్‌ ఇండియా’, ‘మేకిన్‌ ఇండియా’ వంటి పథకాలను గొప్పగా ప్రకటిస్తున్నది. కానీ వాటి ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనబడటం లేదు. భారత్‌ స్కిల్స్‌ రిపోర్ట్‌ 2025 ప్రకారం.. పట్టభద్రులలో 54.8 శాతం మందికే తగిన నైపుణ్యాలు ఉన్నాయి. మరొక రిపోర్ట్‌ ప్రకారం ఎంప్లాయెబిలిటీ రేటు 42.6 శాతంగా ఉన్నది. మిగతా సగం మంది చదివింది ఒకటి.. ఉద్యోగ మార్కెట్‌ కోరుకుంటున్నది ఇంకొకటి ఉంటున్నది. దేశంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులలో 71.5 శాతం మందికి ప్రాథమిక నైపుణ్యాలు ఉన్నప్పటికీ.. 17 శాతం మందికే వారి అర్హతకు తగ్గ ఉద్యోగాలు దొరుకు తున్నాయి. ఫలితంగా.. ఉద్యోగాలు దొరకక పోవడం, దొరికినా ఆలస్యం కావడం, తక్కువ వేతనాలు న్నవి మాత్రమే లభించటం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి కారణాలతో యువతలో తీవ్ర నిరాశ, నిరుత్సాహం ఏర్పడుతున్నది.

పాత సిలబస్‌తోనే నెట్టుకొస్తున్న విద్యాసంస్థలు
భారత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, సంస్థల స్థాపన ఆశించిన స్థాయిలో జరగటం లేదు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి పరిశ్రమలు కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్‌, డేటా సైన్స్‌, ఫిన్‌టెక్‌, సస్టెయి నబిలిటీ వంటి రంగాల్లో వేగంగా దూసుకెళ్తున్నాయి. కానీ దేశంలోని కాలేజీలలో సిలబస్‌ మాత్రం 10-15 ఏండ్ల క్రితం నాటి పుస్తకాలను అనుసరి స్తున్నది. అలాగే విద్యార్థులకు థియరెటికల్‌ నాలెడ్జ్‌ బలంగా ఉన్నా.. ప్రాక్టికల్‌ నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు దొరకడం లేవు. కేంద్రం ప్రకటించే స్కిల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా వంటి పథకాలు, విధానాలు, కార్యక్రమాలు కాగితాలకు మాత్రమే పరిమితమ వుతున్నాయి. వాటి ఫలితాలేవీ ఆశించిన స్థాయిలో మాత్రం కనబడటం లేవు. అయితే వాటి ఫలితాలు కనిపించా లంటే.. విద్యా సంస్థలు, పరిశ్రమలు కలిసి పని చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మార్పులు రావాలి
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత విద్యా వ్యవస్థలో పలు మార్పులు రావాల్సిన ఆవశ్యకతను మేధావులు, నిపుణులు సూచిస్తున్నారు. ‘డిగ్రీ-టు-జాబ్‌’ మోడల్‌తో పాటు ‘స్కిల్‌-టు-కెరీర్‌’ మోడల్‌ను కూడా తీసుకురావాలంటున్నారు. ఉద్యోగాల కల్పనలో పరిశ్రమల భాగస్వామ్యం ప్రాముఖ్యతను వారు సూచిస్తున్నారు. అంటే సంబంధిత కంపెనీలతో కలిసి పాఠ్యాంశాలు రూపొందించాలని వివరిస్తున్నారు. ఏఐ ఆధారిత లెర్నింగ్‌ అవసరమనీ, ప్రతి ఏడాదీ సిలబస్‌ను ఆధునీకరించాలని చెప్తున్నారు. ప్రభుత్వ పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఆశించిన ఫలితాలు తీసుకొచ్చేవిగా ఉండాలని అంటున్నారు.

దేశ యువతే భారత భవిష్యత్తు. కానీ అదే యువత సరైన మార్గనిర్దేశం లేకుండా నిరుత్సా హంలోకి వెళ్తే, అది దేశ ఆర్థికాబి óవృద్ధికి తీవ్ర అడ్డంకి అవుతుం దని మేధావులు హెచ్చరి స్తున్నారు. కాబట్టి కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు నైపుణ్యాభివృద్ధి పైనా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. డిగ్రీ విలువ అది అందించే ఉద్యోగంలో కాదనీ, అది పెంచే సామర్థ్యంలో ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు ఒకే దిశగా కదిలితేనే దేశం నిజమైన స్కిల్‌ నేషన్‌గా మారగలదని మేధావులు చెప్తున్నారు.

విద్యా వ్యవస్థలో లోపాలు
భారత్‌లో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం లోపిస్తున్నది. కాలేజీలు పరిశ్రమ అవసరాలు తెలుసుకోకుండా కోర్సులు రూపొందిస్తున్నాయి. విద్యార్థులు వాస్తవ ప్రపంచ పనిని నేర్చుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాల కొరత కనిపిస్తున్నది. ఏఐ, బ్లాక్‌చెయిన్‌, డిజిటల్‌ ట్రేడ్‌ వం టి కొత్త రంగాలకు సంబంధించిన సమాచారం సిలబస్‌లో కనబడటం లేవు. విద్యాసంస్థలు పాత సిలబస్‌తోనే నెట్టుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -