Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో జాప్యం.!

ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో జాప్యం.!

- Advertisement -

ఐరీస్ నమోదుతోనే ఆలస్యం అంటున్న అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం సొమ్ము వారి ఖాతాల్లో జమకావడంలో జాప్యం జరుగుతోందని,ఇందుకు రైతులు ఐరీస్ నమోదులో ఆలస్యం కావడమేని అధికారులు చెబుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకున్న రైతులకు ఐరిస్ కష్టాలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టంది. అందులో భాగంగా పౌరసరఫరాల శాఖ నూతనంగా ఐరిస్ విధానాన్ని తీసుకొచ్చింది. గతం లో ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసే వారు. ప్రస్తుతం ఓటీపీతో పాటు ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో అక్రమాలకు చెక్ పడనుండగా రైతులకు ఐరిస్ ఇబ్బందులు తప్పడం లేదు.

మండలంలోని 13 పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 80వేల పైచిలుకు ధాన్యం వచ్చింది. వీటిలో 812 మంది రైతుల నుంచి 62 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిం చారు. ఇంకా 20 వేల క్వింటాళ్ల  ధాన్యం రావచ్చని సిఈఓ తెలిపారు.583 మంది రైతులకు సంబంధించిన 48,560 వేల క్వింటాళ్ల ధాన్యం డబ్బులను అధికారులు వారి ఖాతాల్లో జమచేశారు. 229 మంది రైతుల 13,440  క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ.3కోట్ల,88లక్షల.28 వెలు రైతుల ఖాతాల్లో పడాల్సి ఉంది. 

గతంలో చెల్లింపులు ఇలా..
గతంలో రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్ నమోదు చేస్తే వారి మొబైల్కు ఓటీపీ వచ్చేది. దీన్ని ట్యాబ్లో నమోదు చేసి ధాన్యం కొనుగోలు చేసేవారు. అయితే రైతుల పేరుతో వ్యాపారులు, దళారులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఐరిస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయిం చారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం తీసుకువ చ్చి కొనుగోలు కేంద్రాల్లో దళారులు విక్రయించే వారనే అనుమానంతో అక్రమాలను కట్టడి చేసేందుకు ఈ విధానం ప్రవేశపెట్టారు. దీంతో ధాన్యం కాంటా అయిన తర్వాత రైతుల ఐరిస్ విధానం ద్వా రానే ధాన్యం సేకరణ వివరాలను పీఏసీఎస్ సిబ్బం ది ట్యాబ్లో నమోదు చేస్తున్నారు.

ఓటీపీ విధానం లేకపోవడంతో ట్రక్ షీట్లోని ఏ ఒక్కరైతు అయిన ఐరిష్ ఇవ్వకపోతే నగదు చెల్లింపుల్లో జాప్యం అవుతుంది. గతంలో అందుబాటులో లేని రైతుల వివ రాలను నిర్వాహకులు ఫోన్ల ద్వారా సంప్రదించి ఓటీపీతో వివరాలను నమోదు చేసేవారు. ట్యాబ్ లో ఐరిస్ విధానం చూపిస్తుండంతో తప్పని సరిగా రైతులు అందుబాటులో ఉండాల్సి వస్తోంది. నిర్వా హకులు సైతం గ్రామాల్లో రైతుల వద్దకు చేరుకోని వివరాలు సేకరిస్తునప్పటికి కొంత మంది రైతులు అందుబాటులో లేకపోవడం, సిగ్నల్ సమస్యలతో పూర్తిస్థాయిలో నమోదు సాధ్యం కావడం లేదని వారు పేర్కొంటున్నారు. ట్రక్ షీట్లోని మొత్తం రైతుల వివరాలు నమోదు కాక ధాన్యం డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని నిర్వాహకులు, రైతులు చెబుతున్నారు. ట్రక్ షీట్ పూర్తిగా నమో దైన రైతులకు మాత్రం 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -