Sunday, October 19, 2025
E-PAPER
Homeజాతీయంఎన్సీఆర్బీ నివేదికల ప్రచురణలో జాప్యం

ఎన్సీఆర్బీ నివేదికల ప్రచురణలో జాప్యం

- Advertisement -

2023 రిపోర్ట్‌ గత నెలలో విడుదల
రెండేండ్లు ఆలస్యం
పారదర్శకత లోపించిన డేటా
సమాచార పరిశీలన, క్రోడీకరణ కారణం : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : రెండేండ్లు ఆలస్యంగా ప్రచురితమైన 2023వ సంవత్సరపు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలో పారదర్శకత లోపించింది. దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని ఈ నివేదికలో వివరిస్తారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2023లో జరిగిన నేరాలకు సంబంధించిన సమాచారాన్ని గత నెలలో విడుదల చేశారు. 2021లో జరిగిన నేరాల నివేదికను బయటపెట్టడానికి 14 నెలలు పట్టింది. 2023 నివేదిక అయితే రెండు సంవత్సరాల తర్వాత విడుదలైంది. డేటాను పరిశీలించడం, దానిని క్రోడీకరించడానికి సమయం పడుతుందని కేంద్ర హోం శాఖ షరా మామూలుగా వివరణ ఇచ్చింది.

సమాచారాన్ని అందించడంలో జరిగే జాప్యం పారదర్శకతను దూరం చేస్తుంది. సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టే సమయానికి దానిపై ఎవరికీ ఆసక్తి ఉండదు. విద్వేషపూరిత నేరాలు, కస్టడీలో హింస, నిరసనల అణచివేత… వంటి వాస్తవాలన్నింటికీ కాలదోషం పడుతుంది. ఎన్సీ ఆర్బీ మౌనం తటస్థంగానో లేదా నిస్పాక్షికంగానో ఉండాలి. కానీ అది వ్యూహాత్మకంగా ఉంటోంది. 2023 నివేదిక బయటికి వచ్చే సరికే దేశంలో రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగిపోయాయి. దేశంలో మతపరమైన హింసాకాండ పెరిగి పోయింది. 2023 నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో రాజద్రోహం కేసులేవీ నమోదు కాలేదు. మతపరమైన హింసకు సంబంధించిన కేసులూ లేవు. అయితే ఈ ప్రాంతంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, పబ్లిక్‌ సేఫ్టీ చట్టం కింద ప్రజలను పెద్దఎత్తున అరెస్ట్‌ చేయడం, ఇంట ర్నెట్‌ సౌకర్యాన్ని తరచూ నిలిపివేయడం జరిగింది.

మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఉపా, రాజద్రోహం చట్టాల కింద విచారణలు జరిగాయి. కానీ 2023లో ఉపా కింద పరోక్షంగా ఓ విచారణ మాత్రమే జరిగిందని, రాజద్రోహానికి సంబంధించి ఒక్క కేసే నమోదైందని నివేదిక వివరించింది. ఆ ఏడాది కనీసం 12 ఉపా/రాజ ద్రోహం ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని స్వతంత్ర పరిశీలకులు, మీడియా సంస్థలు తెలిపాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయమే మంటే నివేదికలో ద్వేషపూరిత నేరాలు, దాడికి సంబంధించి సమాచారమే లేదు.

కానీ దేశంలో జరిగిన ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ఘటనల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల వాటా 50 శాతానికి పైగా ఉన్నదని ఇండియా హేట్‌ ల్యాబ్‌ తాజా నివేదిక వివరించింది. దేశవ్యాప్తంగా మహిళలపై 0.7 శాతం, చిన్నారులపై 9.2 శాతం నేరాలు పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొన్నది. అయితే మీడియా కథనాల ప్రకారం… మహిళలపై జరుగుతోన్న నేరాల్లో ఎక్కువ భాగం గృహహింసకు సంబంధిం చినవే. ఆ తరహా కేసులు 31.4 శాతం నమోద య్యాయి. చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులు కూడా గణనీయంగానే వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -