Sunday, May 11, 2025
Homeజాతీయంఢిల్లీ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు పున:ప్రారంభం

ఢిల్లీ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు పున:ప్రారంభం

- Advertisement -

– విమాన ప్రయాణికులకు కీలక సూచనలు
ఢిల్లీ : భారత్‌ -పాక్‌ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన చేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు.
ప్రయాణికులకు జారీ చేసిన సూచనలు:
– తమ విమానాల తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు విమాన
సంస్థలను సంప్రదించాలి.
– హ్యాండ్‌ బాగేజ్‌, చెక్‌-ఇన్‌ లగేజీ నిబంధనలు పాటించాలి.
భద్రతా తనిఖీలకు ముందుగా సమయం కేటాయిస్తూ
– విమానాశ్రయానికి ముందుగానే రావాలి.
– విమానాశ్రయం, విమాన సంస్థ సిబ్బందితో సహకరించాలి.
– తమ విమాన స్థితిని అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఎయిర్‌లైన్‌ అప్లికేషన్‌
ద్వారా తనిఖీ చేయాలి.
– నిర్ధారణ లేని సమాచారాన్ని పంచుకోకుండా, అధికారిక సమాచారం
మాత్రమే తెలుసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -