హెరిటేజ్ కథనాలపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
24 గంటల్లో లింకులు తొలగించాలని ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సాక్షి మీడియాకు గురువారం ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. హెరిటేజ్ ఫుడ్స్ ఆ సంస్థపై రూ.100 కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. భోలే బాబా డెయిరీ నెయ్యి వివాదంతో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని, హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేలా, పూర్తి అసత్యాలతో కథనాలు ప్రచురించారని పిటిషన్‌లో పెర్కొన్నారు. ఈ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కరణ ధర్మాసనం విచారించింది. హెరిటేజ్ పుడ్స్‌కి, బోలెబాబా డైరీకి సంబంధం ఉందనే సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను 24 గంటల్లో అన్ని లింక్‌లు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో మెటా, గూగుల్, యూట్యూబ్ సంస్థలు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.
సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -



