Monday, November 10, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఉలిక్కిపడిన ఢిల్లీ.. హైదరాబాద్ లో హై అలర్ట్

ఉలిక్కిపడిన ఢిల్లీ.. హైదరాబాద్ లో హై అలర్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. వెంటనే ఎన్‌ఐఏ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ముంబయి, హైదరాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో అలర్ట్‌ ప్రకటించినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -