Monday, January 26, 2026
E-PAPER
Homeజాతీయంవాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

- Advertisement -

– రాహుల్‌
న్యూఢిల్లీ :
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య కారణంగా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా చిన్నారులు, వయోవద్ధుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని విస్మరించరాదని, మార్పు దిశగా మొదటి అడుగు మన గళాన్ని వినిపించడమేనని తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘వాయు కాలుష్యం కారణంగా ఆరోగ్యం, ఆర్థిక రూపంలో ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. కోట్లాది మంది సామాన్య పౌరులు రోజూ ఈ భారాన్ని మోస్తున్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బతింటోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలపై తీవ్ర ప్రభావం పడుతోంది’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -