Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ నో సేఫ్‌

ఢిల్లీ నో సేఫ్‌

- Advertisement -

అత్యంత అసురక్షిత నగరంగా నిలిచిన దేశరాజధాని

న్యూఢిల్లీ : 2023లో దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మహిళలపై నేర కేసులు నమోదయ్యాయి. గత రెండేండ్లతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజా జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం, ఢిల్లీ వరుసగా మూడవ సంవత్సరం మహిళలకు అత్యంత అసురక్షిత ”మెగా నగరం”గా దేశరాజధాని నిలిచింది.రాష్ట్రాలలో, మహిళలపై నేరాలకు సంబంధించి అత్యధిక కేసులు ఉత్తర ప్రదేశ్‌లో 66,381, మహారాష్ట్రలో 47,101, రాజస్థాన్‌లో 45,450, బెంగాల్‌లో 34,691 , మధ్యప్రదేశ్‌లో 32,342 నమోదయ్యాయి.ఢిల్లీలో 1,088 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలోని 19 మెట్రోపాలిటన్‌ నగరాల్లో అత్యధికం. 2023లో దేశ రాజధానిలో మహిళలపై మొత్తం 13,366 నేరాలు నమోదయ్యాయి .

ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, మెట్రోపాలిటన్‌ నగరాల్లో దేశ రాజధానిలో అత్యధికంగా 503 హత్య కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 206, జైపూర్‌లో 129 హత్య కేసులు నమోదయ్యాయి.వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం 15,489 కేసులు, అనైతిక రవాణా (నివారణ) చట్టం, 1956 ప్రకారం మహిళా బాధితులకు సంబంధించిన కేసులు 1,788 నమోదయ్యాయి. గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005 ప్రకారం 632 కేసులు నమోదయ్యాయి.కోర్టు డిస్పోజల్‌ డేటా ప్రకారం గతేడాది నుంచి 21,84,756 కేసులు విచారణలో పెండింగ్‌లో ఉన్నాయి, 3,50,937 కొత్త కేసులు , 6,276 తిరిగి తెరవబడ్డాయి, మొత్తం 25,35,693 కేసులు ఉన్నాయి. కోర్టులలో పెండింగ్‌ కేసులు 23,03,657 కేసులు లేదా 90.8 శాతం చేరుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -