పోరాడి ఓడిన హైదరాబాద్
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ పోరాడి ఓడింది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీవీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ తుఫాన్స్ చేతిలో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 0-3తో ఓటమి చెందింది. మ్యాచ్ మూడు సెట్లలోనే ముగిసినా బ్లాక్‌హాక్స్ గట్టి పోటీ ఇచ్చింది. 10-15, 14-16, 15-17తో హౌరాహౌరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ తుఫాన్స్ మెరుగైన ప్రదర్శన చేసింది. తొలి సెట్‌ను ఐదు పాయింట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ తుఫాన్స్‌కు తర్వాతి రెండు సెట్లలో బ్లాక్‌హాక్స్ ఆఖరు వరకు గట్టి పోటీ ఇచ్చింది. టైబ్రేకర్‌కు దారితీసిన సెట్లలో బ్లాక్‌హాక్స్‌కు నిరాశ తప్పలేదు. కార్లోస్ బెరియోస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. పీవీఎల్ సీజన్ 4లో హైదరాబాద్‌కు మూడు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం.