ప్రొ కబడ్డీ సీజన్-12
చెన్నై: ప్రొ కబడ్డీ సీజన్-12 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టు యుపి యోథాస్‌ను చిత్తుచేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 43-26పాయింట్ల తేడాతో యుపి జట్టును చిత్తుచేసింది. ఢిల్లీ జట్టులో ఆశు మాలిక్(14పాయింట్లు), పవార్, అత్రాచలి ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక ఆ జట్టు ఏకంగా ఆరుసార్లు యుపి జట్టును ఆలౌట్ చేసింది. ఇక యుపి జట్టులో గగన్(12) ఒంటరి పోరాటం మినహా.. మిగతా ఏ ఒక్క రైడర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఢిల్లీ జట్టు రైడ్‌ల ద్వారా 22పాయింట్లు సాధించడంతో పాటు ట్యాకిల్స్ ద్వారా మరో 11 పాయింట్లు చేజిక్కించుకుంది. ఇక యుపి జట్టు రైడ్‌లతో 20 పాయింట్లు సాధించినా.. ట్యాకిల్స్‌లో కేవలం 5పాయింట్లు మాత్రమే సాధించడంతో ఓటమిపాలైంది.