నవతెలంగాణ – తొగుట
వెంకట్రావుపేట విద్యార్థులు రాష్ట్రస్థాయి బీచ్ వాలీ బాల్ పోటీలకు ఎంపిక కావడం హర్షనీయం అని ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నయీమా కౌసర్ అన్నారు. ఆదివారం ప్రధానోపాధ్యాయులు మాట్లా డుతూ.. ఎస్జీఎఫ్ బీచ్ వాలీబాల్ అండర్ 17 విభా గంలో ఇటీవల గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానం సాధించారాని అన్నారు. అందులో మన వెంకట్రావుపేట ఉన్నత పాఠశాలకు చెందిన కంది అర్చన, బెజ్జనమైన శివాని రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపిక అయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల వారికి ప్రధానోపాధ్యాయు లు నయీమా కౌసర్, వ్యాయమ ఉపాధ్యాయుడు కనకయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
రాష్ర్టస్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



